నేను సింగిల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికాషెరావత్
on Nov 28, 2024
భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు మల్లికా షెరావత్(mallika sherawat)2003 లో 'వాషిష్' అనే చిత్రం ద్వారా హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసిన మల్లికా, ఆ తర్వాత మర్డర్, కిస్ కిస్ కి కిస్మత్,గురు, వెల్ కమ్, థాంక్యూ, తేజ్, జీనత్, డర్టీ పాలిటిక్స్ ఇలా సుమారు ముప్పై సినిమాల దాకా చేసింది.కమల్ హాసన్ హీరోగా తమిళ,తెలుగు భాషలో విడుదలైన "దశావతారం' మూవీలో కూడా తనదైన నటనతో ప్రేక్షకులని అలరించిన మల్లికా రీసెంట్ గా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' అనే సినిమాలో ప్రధాన పాత్రని పోషించింది.గత నెల అక్టోబర్ 11 న విడుదలైన ఈ మూవీ ఈ నెలలోనే ఓటిటి లో విడుదలకి సిద్దమవుతుంది.
ఈ క్రమంలో మల్లికా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో ఆమె మాట్లాడుతు గతంలో నేను ఒక వ్యకితో ప్రేమలో ఉన్న మాట నిజమే కానీ అది బ్రేకప్ అయ్యింది. దాని గురించి ఇప్పుడు ఏమి మాట్లాడదల్చుకోలేదు.ప్రస్తుతానికి అయితే సింగల్ గానే ఉంటున్నాను.పెళ్లి పై నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.మంచి మనసున్న వ్యక్తిని పొందటం ఈ రోజుల్లో కష్టమే.శరీరాకృతి, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ, మంచి భోజనము తీసుకొని సమయానికి నిద్రపోతున్నాను.ఎలాంటి చెడు వ్యసనాలు కూడా లేవని చెప్పుకొచ్చింది
అలాగే డైరెక్టర్స్ సినిమా ఒప్పుకునే ముందు మన క్యారెక్టర్ గురించి ఒక రకంగా చెప్పి,ఆ తర్వాత వేరే రకంగా తెరకెక్కిస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్టు 'ది రాయల్స్ 'ని తిరస్కరించాననే విషయాన్ని కూడా వెల్లడి చేసింది.
Also Read